Ramayana Part 1 Title: రణ్‌బీర్‌ కపూర్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. ‘రామాయణ’ పార్ట్‌ 1 టైటిల్‌ ఇదే!

Ramayana Part 1 Title

Ramayana Part 1 Title

Ramayana Part 1 Title is Rise of a Legend: బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితీశ్‌ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. నమిత్‌ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు.

రామాయణను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో తొలి భాగాన్ని ఈ దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ‘రామాయణ: పార్ట్‌-1’గా పిలుస్తుండగా.. తాజాగా మేకర్స్‌ మొదటి భాగానికి అధికారిక టైటిల్‌ను ప్రకటించారు. రణ్‌బీర్‌ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తొలి భాగానికి ‘రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మానవాళి చరిత్రలో అత్యుత్తమ కథకు ప్రాణం పోస్తున్నాం’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా యశ్‌ పాత్రలను హైలైట్‌ చేశారు. ఇద్దరి పాత్రలను ప్రతిబింబించేలా రూపొందించిన పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ విజువల్స్‌, గ్రాండ్‌ మేకింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్‌ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. రైజ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌ అనే టైటిల్‌తో తొలి భాగంపై అధికారిక క్లారిటీ రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న రామాయణ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.