Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Creates BookMyShow Record: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ మరో అరుదైన ఘనత సాధించింది. బుక్‌మైషోలో అత్యధిక పీక్ అవర్ ట్రెండింగ్ ఆసక్తిని నమోదు చేసిన సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటికే సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి.. రామాయణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. బుక్‌మైషో గణాంకాల ప్రకారం.. రామాయణ 1,11,830 ట్రెండింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2026 దీపావళి ఆదివారం కావడంతో.. సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.
1,09,170తో ‘ధురంధర్ 2’ రెండో స్థానంలో ఉండగా.. 1,07,650తో ‘పుష్ప 2’ మూడో స్థానాన్ని దక్కించుకుంది. 96,140తో ‘ఎంపురాన్’ నాలుగో స్థానంలో ఉండగా.. 95,710తో ‘కల్కి 2898 ఏడీ’ ఐదో స్థానంలో ఉంది. ‘కాంతార: చాప్టర్ 1’ 87,900తో ఆరో స్థానంలో, ‘జవాన్’ 86 వేలతో ఏడో స్థానంలో నిలిచాయి. ‘జైలర్ 2’ 85,320తో ఎనిమిదో స్థానంలో, ‘లియో’ 82,400తో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. 80,150 ట్రెండింగ్‌తో ‘యానిమల్’ పదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ‘ఎంపురాన్’, ‘లియో’ చిత్రాలకు సంబంధించిన గణాంకాలు ప్రీ-సేల్స్ సమయంలో నమోదైనవి.
Also Read
- Ramayana Box Office: 'ఆదిపురుష్' రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
- Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
- Anushka Shetty: అనుష్క శెట్టి.. ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ ఏదైనా చెబుతుందా?
- Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
బాక్సాఫీస్ వద్ద కూడా రామాయణ రికార్డుల వేట కొనసాగిస్తోంది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కుకు చేరువైంది. భారత్‌లో మొత్తం నెట్ వసూళ్లు రూ.238.85 కోట్లు కాగా.. గ్రాస్ వసూళ్లు రూ.285.20 కోట్లు. ఓవర్సీస్లో రూ.214 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.499.20 కోట్లు కొల్లగొట్టింది. దీపావళి సందర్భంగా రామాయణ భారీ వసూళ్లు సాధించింది. భారత్‌లో ఆదివారం రూ.56.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా వ్యవహరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజావార్తలు
-
Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
-
Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
-
Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..