Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?

Ramayana Record

Ramayana Record

Ramayana Box Office Collections: నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఊహించని రీతిలో వసూళ్లు సాధిస్తూ.. భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. రామాయణ కేవలం 21 రోజుల్లోనే ‘బాహుబలి 2’ లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. దాంతో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. బాహుబలి 2 రికార్డును అధిగమించిన రామాయణ నెక్స్ట్ టార్గెట్ ధురంధర్ 2.

రామాయణ 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,790 కోట్ల నుంచి రూ.1,800 కోట్లు వసూల్ చేసింది. దీంతో బాహుబలి 2 రూ.1,788.06 కోట్ల వసూళ్లు అధిగమించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ప్రస్తుతం రూ.2,070.30 కోట్లతో ‘దంగల్’ అగ్రస్థానంలో ఉంది. రూ.1,852.44 కోట్లతో ‘ధురంధర్ 2’ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రూ.1,790–1,800 కోట్ల అంచనా వసూళ్లతో ‘రామాయణం’ మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. రామాయణ, బాహుబలి 2 వరుసగా మూడు, నాలుగో స్థానంలో ఉండగా.. రూ.1,742.10 కోట్లతో ‘పుష్ప 2’ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘ధురంధర్’ రూ.1,307.35 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’ రూ.1,230 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,215 కోట్లు, ‘జవాన్’ రూ.1,160 కోట్లు, ‘పఠాన్’ రూ.1,055 కోట్ల వసూళ్లతో టాప్-10లో ఉన్నాయి.