ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. పాండిచ్చేరిలో జరిగిన తాజా షెడ్యూల్‌లో రామ్ పోతినేని చూపించిన డెడికేషన్ చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ షెడ్యూల్‌లో రామ్ పోతినేని నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏకధాటిగా ఏకంగా 24 గంటల పాటు షూటింగ్‌ను పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు.
ఒక భారీ సెటప్‌లో దాదాపు 9 రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణను చిత్ర బృందం చేపట్టింది. పాండిచ్చేరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా షూటింగ్‌కు స్వల్ప అంతరాయం కలగడంతో ఈ షెడ్యూల్‌ను తాత్కాలికంగా ముగించారు. మిగిలిన కీలక సన్నివేశాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం త్వరలోనే తిరిగి పాండిచ్చేరి వెళ్లనుంది. నటుడిగా, దర్శకుడిగా రెండు కీలక బాధ్యతలను భుజాన వేసుకుని రామ్ చేస్తున్న ఈ హార్డ్‌వర్క్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.

