RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక ఊహించని, కళ్లు చెదిరే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తన ఎనర్జిటిక్ డ్యాన్సులు, యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన రామ్.. ఇప్పుడు సరికొత్తగా మెగాఫోన్ పట్టారు. అవును, తన ప్రతిష్టాత్మక 23వ చిత్రం (#RAPO23) కోసం రామ్ కేవలం హీరోగానే కాకుండా ఏకంగా డైరెక్టర్ బాధ్యతలు కూడా భుజాన వేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తన తొలి దర్శకత్వ ప్రయత్నంలోనే రామ్ ‘నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్’ను ఎంచుకోగా ఈ చిత్రంతో బాలీవుడ్ విలక్షణ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. ‘ఏక్ విలన్’, ‘రైడ్ 2’, బ్లాక్‌బస్టర్ ‘రాజా శివాజీ’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిన రితేశ్ దేశ్‌ముఖ్.. రామ్ చెప్పిన కథ, తన క్యారెక్టరైజేషన్ వినగానే సింగిల్ సిట్టింగ్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న భారీ షెడ్యూల్లో రితేశ్ జాయిన్ అయ్యారు. ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టగానే డైరెక్టర్ కమ్ హీరో రామ్ వెళ్లి ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఓ ‘బీటీఎస్’ వీడియోను చిత్ర యూనిట్ వదిలింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారుతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో, కాంప్రమైజ్ కాని నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు. రామ్ మార్క్ యాక్షన్‌కు తోడు గూస్బంప్స్ తెప్పించే మైండ్ గేమ్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఇక టాలీవుడ్ గోల్డెన్ లెగ్, లక్కీ ఛార్మ్ సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండటం ప్రాజెక్ట్‌కు మరింత గ్లామర్‌ను అద్దింది. డైరెక్టర్‌గా తన తొలి అడుగులోనే రామ్.. పాన్ ఇండియా స్థాయి టెక్నీషియన్లను రంగంలోకి దించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కెమెరామెన్ తిరునవుక్కరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ‘ఖైదీ’ ఫేమ్ సామ్ సీఎస్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థ్రిల్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ రేంజ్లో డిజైన్ చేయడానికి పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ లాంటి ముగ్గురు యాక్షన్ డైరెక్టర్లు పనిచేస్తుండటం విశేషం. మొత్తానికి అటు డైరెక్షన్.. ఇటు యాక్షన్.. దానికి తోడు రితేశ్ దేశ్‌ముఖ్ లాంటి బాలీవుడ్ పవర్‌హౌస్ పెర్ఫార్మర్ ఎంట్రీతో #RAPO23 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసేలా కనిపిస్తోంది!
Also Read
- Vijay Deverakonda: యాక్షన్‌కు బ్రేక్.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్!
- Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
- Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
- Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
తాజావార్తలు
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
-
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
-
Thiruvananthapuram Airport: అరుదైన సంప్రదాయం.. అక్టోబర్ 20న 5 గంటల పాటు విమానాలు నిలిపివేత..!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!