Site icon NTV Telugu

RGV : శివ’లో నాగార్జున కూతురికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ

Rgv

Rgv

ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు డైరెక్ట్ చేసి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ గా నిలిపిన ‘శివ’ రీ-రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మీడియా కోసం ఒక స్పెషల్ షో కూడా ఈ మధ్యకాలంలోనే వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నాగార్జున ఒక చిన్న పాపను సైకిల్ మీద ఎక్కించుకొని ఒక చేజింగ్ సీక్వెన్స్ చేశారు సినిమాలో. ఆ పాప నాగార్జున అన్న మురళీమోహన్ కుమార్తె పాత్రలో నటించింది. ఆ పాత్ర పేరు కీర్తి. ఇప్పుడు ఆ పాప ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే విషయాలు ఎవరికీ తెలియవు. కానీ రాంగోపాల్ వర్మ ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. ఆ పాప పేరు సుష్మ అని, సైకిల్ కడ్డీ మీద ఎలాంటి భయం లేకుండా కూర్చున్న ఆమె అమెరికాలో రీసెర్చ్ చేస్తోందని చెప్పుకొచ్చారు.

Also Read : Delhi Car Blast: చాలా బాధాకరం.. దాడులతో సంబంధంలేదన్న అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ

అంతేకాకుండా, దీనికి సుష్మ స్పందిస్తూ, “శివ లీగసీలో నన్ను కూడా గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ మరిచిపోలేనిది. నేను కూడా అలాంటి ఒక ఐకానిక్ సినిమాలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అలాగే రీ-రిలీజ్ సందర్భంగా మీకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సుష్మకు రామ్‌ గోపాల్ వర్మ, “దయచేసి నా హృదయపూర్వక అపాలజీ స్వీకరించు. ఎందుకంటే చిన్నప్పుడే నీకు అలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నిన్ను నెట్టివేశాను” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. “ఎలా అయినా దర్శకుడి నవ్వాలనే ఒక ఆశ నా చేత అలా చేయించింది. మరోసారి నీకు సారీ చెబుతున్నాను” అంటూ అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version