Site icon NTV Telugu

Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్?

Allu Arjun Notice

Allu Arjun Notice

సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయి ఒక రాత్రి జైలుకు కూడా వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ని పోలీసుల టెన్షన్ వదిలేట్టు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు అల్లు అర్జున్ కి రాంగోపాల్ పెట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముందుగా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బాలుడిని కలవలేక పోతున్నానని అల్లు అర్జున్ మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు బాలుడిని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తానంటున్నాడు అల్లు అర్జున్.

Tollywood Movies : కర్ణాటకలో తెలుగు చిత్రాలకు ఘోర అవమానం.. ఇది అస్సలు సహించేంది లేదు

ఇప్పుడు వద్దని, ఒకవేళ ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తే పూర్తి బాధ్యత ఆయనదేనంటూ పోలీసులు చెబుతున్నారు. నిన్న అల్లు అర్జున్ కోసం నోటీసులు ఇచ్చేందుకే వెళ్లినా ఇవ్వకుండానే తిరిగి వచ్చారు. అయితే ఈరోజు మాత్రం అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్ కి నోటీసులు ఇచ్చారు రాంగోపాల్ పేట్ పోలీసులు. నిన్న అల్లు అర్జున్ పోలీసులు వచ్చిన సమయానికి నిద్ర లేవ లేదని చెప్పడంతో, మేనేజర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగినా పోలీసులు అది నిజం కాదని అన్నారు. ఇక తాజాగా పోలీసులు కోర్టు పర్మిట్ లేకుండా అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ ఘటన అల్లు అభిమానులు, మీడియా మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Exit mobile version