Site icon NTV Telugu

Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

Peddi Release Date

Peddi Release Date

‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మార్చి 27న చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా థియేటర్లోకి రావాల్సి ఉంది పెద్ది. కానీ వాయిదా అని తెలియడంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుటుందా? అని వెయిట్ చేస్తున్నారు మెగా భిమానులు. ఇండస్ట్రీ వర్గాల సోర్స్ ప్రకారం.. మే లేదా జూన్‌ నెలలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2026 సమ్మర్ హాలిడేస్ కలిసొచ్చేలా మే 1వ తేదీన పెద్దిని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ప్రస్తుతానికైతే ఇది పరిశీలనలో ఉన్న ఒక తేదీ అని మాత్రమే అంటున్నారు. ఫిక్స్ అయితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండనుంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ పై అదిరిపోయే సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. మరో నెల రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ‘పెద్ది’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్టాఫ్ లాక్ అయిందని వార్తలు రాగా.. అవుట్ పుట్ అదిరిపోయిందని అంటున్నారు.

Also Read: RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!

ఇప్పటికే పెద్ది నుంచి రిలీజ్ చేసిన చికిరి చికిరి సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయింది. ఫిబ్రవరిలో సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెక్కిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఉంది. మరి పెద్ది రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.

Exit mobile version