మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలకు చేరుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది పెద్ది టీమ్. ఇటీవలే బుచ్చి బాబు ‘పెద్ది’ ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన ఫైనల్ కట్‌ను లాక్ చేసాడు. ఈ వెర్షన్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆర్ ఆర్ చేసేందుకు ఇచ్చాడు బుచ్చి. ఈ సినిమాకు రెహమాన్ తన బెస్ట్ వర్క్ ఇస్తాడని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
Also Read : Vishwaksen : వరుస ప్లాపులు.. ఫంకీ సినిమాపైనే విశ్వక్ సేన్ ఆశలు..
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదే ఊపులో ఫిబ్రవరిలో సెకండ్ సింగిల్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్ చరణ్ ఒక అథ్లెట్ పాత్రలో కనిపించనున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని భారతీయ భాషల్లో మార్చి 27, 2026న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే పెద్ది అనుకున్న డేట్ కు రాదనీ మే నెలకు వాయిదా వేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పడు వచ్చిన సరే రామ్ చరణ్ కెరీర్ లో పెద్ది ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదని యునిట్ సమాచారం.