రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఆర్‌సీ 16 మేకర్స్. గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత, రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ దాదాపు చాలా ఆటలలో ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు.
Amit Shah: ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..
అయితే, మార్చి 28వ తేదీన రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వడం కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ఫోటోషూట్ నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఫస్ట్ లుక్ లేదా బర్త్‌డే స్పెషల్ పోస్టర్ ఏదైనా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా, అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పటికే ముంబై వెళ్లి వచ్చిన రామ్ చరణ్ తేజ, ప్రస్తుతం ఫోటోషూట్‌లో బిజీగా గడుపుతున్నాడు.