Site icon NTV Telugu

Ram Charan: ‘దేవర’కి చరణ్ విషెష్

ntr and ram charan

Ram Charan Wishes Tarak and Team Devara Amid Release: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రాత్రి ఒంటిగంటకే బెనిఫిట్ షోస్ పడనున్నాయి. అభిమానులైతే ఇప్పటినుంచి సంబరాలు మొదలుపెట్టేశారు. తమ హీరో ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వారంతా మంచి మూడ్లో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కి, దేవర టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Devara: నైట్ ఒంటి గంటకు 500 షోలు.. మెంటలెక్కిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్

తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఆయన సినిమా కంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తరకెక్కిన దేవర సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో నా బ్రదర్ తారక్ అలాగే దేవర టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ రామ్ చరణ్ తేజ్ ట్వీట్ చేశారు. నిజానికి సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి రామ్ చరణ్ అభిమానులుగా చలామణి అవుతున్న కొన్ని అకౌంట్ల ద్వారా ఈ సినిమా మీద నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ తేజ స్వయంగా విషెస్ చెప్పడంతో సినిమా మీద ఆ ఎఫెక్ట్ కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version