NTV Telugu Site icon

Ram Charan : ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం ‘అయ్యప్పమాల’లో కడప దర్గాకు రామ్ చరణ్..

Dargah

Dargah

ముస్లింల మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా కడప అమీన్ పీర్ దర్గాను భావిస్తారు. ప్రతి ఏటా కడప దర్గాలో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలనుగత రెండు రోజులుగా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎప్పటిలాగే రాష్ట్ర నలుమూలల నుండి ఈ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివెళుతున్నారు.ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుకు ఆహ్వానాలు అందజేశారు దర్గా పీఠాధిపతి  ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని.

Also Read : Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై రాజమౌళి రియాక్షన్.. దటీజ్ బన్నీ

అందులో భాగంగా కడప నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ రానున్నారు. అమీన్ పీర్ దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేడు సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి 5: 30 గంటలకు బయలుదేరి 6: 30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మెగా అభిమానుల సమక్షంలో భారీ ర్యాలీతో పెద్ద దర్గాను చేరుకుని అక్కడ జరుగుతున్న ఉరుసు ఉత్సవాల వద్దకు 8:00 గంటలకు పాల్గొంటారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనల  అనంతరం రాత్రి 9.30 గంటలకు తిరిగి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని  విమానంలో హైదరాబాద్  బేగంపెట్ లో 10:30 ల్యాండ్ అవుతారు. కడపలోని ఈ  అమీన్ పీర్ దర్గా ఎంతో విశిష్టిత కలిగినది. సినీపరిశ్రమకు చెందిన ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాను దర్శించనున్నారు. రామ్ చరణ్ కడప వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కట్టుదిట్టమైన ఏర్పట్లు చేసారు పోలిసులు.