NTV Telugu Site icon

Ram Charan: సంక్రాంతి అయింది.. ఈసారి దసరా మీద కన్నేసిన చెర్రీ

Ram Charan, Buchi Babu

Ram Charan, Buchi Babu

ఒకపుడు సంగతి ఏమో కానీ ఇపుడు సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు.. వచ్చేస్తుందంతే. ఓ బ్లాక్ బస్టర్ హిట్టు లేదా ఊహించని ప్లాప్ పడ్డాక ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడానికి చాలా టైం పడుతోంది. ప్రభాస్, తారక్‌లా త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు చరణ్. గేమ్ ఛేంజర్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా పవర్ స్టార్.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. వినిపిస్తోంది. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్.. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ చూశాడు. అంతకు ముందే శంకర్ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా శంకర్ సినిమా అంటే లాంగ్ టైం తీసుకుంటాడు అని తెలిసినా.. ఇంత టైమ్ టేకింగ్ అని ఊహించలేదు. ఎట్టకేలకు 2025 సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. అయితే ఈ మూడేళ్లలో ఫ్యాన్స్‌కు గ్యాప్ ఇచ్చేసిన చరణ్.. ఇప్పుడు ఈ గ్యాప్ పూడ్చాలని డిసైడ్ అయ్యాడు.

Rekhachithram : మలయాళంలో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ

ఏడాదికి వన్ ఆర్ టు సినిమాలను దింపేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు చిరంజీవి తనయుడు. మినిమం ఇయర్‌లో వన్ మూవీతో ఐనా అభిమానులతో టచ్‌లో ఉండేలా ప్లాన్స్ వేస్తున్నాడు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో వస్తే.. మరో పండుగకు కర్చీఫ్ రెడీ చేసుకుంటున్నారు. ప్రజెంట్ చెర్రీ టూ మూవీస్ కమిటయ్యాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఆర్సీ16, సుకుమార్‪తో మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఆర్సీ 16 ఇప్పటికే వన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా, ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్సీ16ని చకా చకా పూర్తి చేసి.. దసరా బరిలో దింపాలని ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దసరా హాలీడేస్ టార్గెట్ చేస్తూ ఆర్సీ 16ని తీసుకురావాలని అనుకుంటున్నారట చెర్రీ. ఫ్యాన్స్‌తో వచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసి..వారిని ఖుషీ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది చూడాలి.

Show comments