Peddi : అదిరిందిపోయిన రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రోమో..

Peddi Prommo

Peddi Prommo

రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ అనౌన్స్‌మెంట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

లేటెస్ట్ ప్రోమో ప్రకారం, ‘పెద్ది’ చిత్ర గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మే 18న ముంబైలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. “పెద్ది గాడు ఇక్కడ కొడితే బాల్ ముంబైలో పడింది” అంటూ వదిలిన ఈ ప్రోమో కట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో, హిందీ బెల్ట్‌లో కూడా సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రోమో చివరలో రామ్ చరణ్‌కు సంబంధించిన ఒక కుస్తీ (Wrestling) ఫైట్ సీక్వెన్స్‌ను చిన్న గ్లింప్స్‌గా చూపించారు.

అందులో చరణ్ పవర్‌ఫుల్ లుక్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద పెద్ది గాడి వేట మామూలుగా ఉండదని అర్థమవుతోంది. క్రికెట్, కుస్తీ వంటి స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో పాటు పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరుకున్నాయి. మే 18న రాబోతున్న ట్రైలర్ తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.