Peddi :‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ విడియోతో సోషల్ మీడియా షేక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ అనౌన్స్మెంట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
లేటెస్ట్ ప్రోమో ప్రకారం, ‘పెద్ది’ చిత్ర గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మే 18న ముంబైలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. “పెద్ది గాడు ఇక్కడ కొడితే బాల్ ముంబైలో పడింది” అంటూ వదిలిన ఈ ప్రోమో కట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో, హిందీ బెల్ట్‌లో కూడా సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రోమో చివరలో రామ్ చరణ్‌కు సంబంధించిన ఒక కుస్తీ (Wrestling) ఫైట్ సీక్వెన్స్‌ను చిన్న గ్లింప్స్‌గా చూపించారు.
Also Read
అందులో చరణ్ పవర్ఫుల్ లుక్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద పెద్ది గాడి వేట మామూలుగా ఉండదని అర్థమవుతోంది. క్రికెట్, కుస్తీ వంటి స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో పాటు పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరుకున్నాయి. మే 18న రాబోతున్న ట్రైలర్ తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.
MUMBAAAIIIII, Remember his name #PEDDI, he is coming 💥💥#PEDDI Trailer Takeover from May 18th, More details soon❤️🔥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th❤️🔥 pic.twitter.com/9EZfM1LnGV
— PEDDI (@PeddiMovieOffl) May 13, 2026
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!