Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్

Ram Charan Bat

Ram Charan Bat

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. తాజాగా చిత్ర యూనిట్ ఒక మంచి పని చేసి వార్తల్లోకి ఎక్కింది. సమాజంపై తమకున్న బాధ్యతను చాటుకుంటూ, ‘పెద్ది’ టీం అనాథ ఆశ్రమాలలోని పిల్లలకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్‌ను ఉపయోగించారు. ఈ చిత్రంలో చరణ్ వాడిన ఆ ఒరిజినల్ బ్యాట్‌ను పోలిన ప్రత్యేకమైన రెప్లికాలను యూనిట్ తయారు చేయించింది. మరీ ముఖ్యంగా, ఈ బ్యాట్లపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా సంతకాలు చేయడం విశేషం.

చరణ్ సైన్ చేసిన ఈ అరుదైన క్రికెట్ బ్యాట్లను అనాథ ఆశ్రమాలలోని చిన్నారులకు ‘పెద్ది’ టీమ్ పంపిణీ చేసింది. మెగా హీరో సంతకం ఉన్న బ్యాట్లను అందుకోవడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “అనాథ పిల్లల్లో సరికొత్త స్ఫూర్తిని నింపడానికి, వారి ముఖాల్లో మధురమైన చిరునవ్వులు పూయించడానికి ‘పెద్ది’ టీమ్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పిల్లల కలలకు ఈ బ్యాట్లు సరికొత్త రెక్కలు ఇస్తాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.” ఈ అద్భుతమైన క్రికెట్ బ్యాట్‌ను ‘పెద్ది’ సినిమా కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేశారు. కేవలం సినిమా కోసమే కాకుండా.. అనాథ పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనే యూనిట్ రిక్వెస్ట్ మేరకు, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరిన్ని బ్యాట్లను సిద్ధం చేశారు

×
×
Ad