Peddi: రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికాలో.. ‘పెద్ది’ రికార్డ్ హంగామా..

Peddi

Peddi

‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో అంతర్జాతీయంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ సినిమా కావడంతో.. ‘పెద్ది’ చిత్రంపై ఓవర్సీస్ (Overseas) మార్కెట్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘హెల్లాళ్ళల్లో’ ఐటెం సాంగ్.. ఇతర సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ‘పెద్ది’ బాక్సాఫీస్ వేటను అప్పుడే షురూ చేసింది.

తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు సంబంధించి జరిగిన ప్రీ-సేల్స్ (Pre-Sales) అప్పుడే $500K (హాఫ్ మిలియన్ డాలర్లు) మార్కును దాటేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ప్రీ-సేల్స్ ట్రెండ్ చూస్తుంటే కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చాలా సులువుగా చేరేలా కనిపిస్తోంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌కు బుచ్చిబాబు బ్రాండ్ తోడవడంతో యూఎస్ఏ (USA) ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, బాలీవుడ్ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) అందించిన సాంగ్స్ అన్నీ చార్ట్‌బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ముఖ్యంగా శృతి హాసన్ మెరిసిన ‘హెల్లాళ్ళల్లో’ మాస్ ఆంథెమ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి!