Peddi: రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికాలో.. ‘పెద్ది’ రికార్డ్ హంగామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో అంతర్జాతీయంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ సినిమా కావడంతో.. ‘పెద్ది’ చిత్రంపై ఓవర్సీస్ (Overseas) మార్కెట్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘హెల్లాళ్ళల్లో’ ఐటెం సాంగ్.. ఇతర సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ‘పెద్ది’ బాక్సాఫీస్ వేటను అప్పుడే షురూ చేసింది.
తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు సంబంధించి జరిగిన ప్రీ-సేల్స్ (Pre-Sales) అప్పుడే $500K (హాఫ్ మిలియన్ డాలర్లు) మార్కును దాటేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ప్రీ-సేల్స్ ట్రెండ్ చూస్తుంటే కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చాలా సులువుగా చేరేలా కనిపిస్తోంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌కు బుచ్చిబాబు బ్రాండ్ తోడవడంతో యూఎస్ఏ (USA) ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, బాలీవుడ్ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) అందించిన సాంగ్స్ అన్నీ చార్ట్బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ముఖ్యంగా శృతి హాసన్ మెరిసిన ‘హెల్లాళ్ళల్లో’ మాస్ ఆంథెమ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి!
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?