Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?

Peddi Box Office Target

Peddi Box Office Target

బడ్జెట్ విషయంలో ‘పెద్ది’, ‘గేమ్ చేంజర్’కు ఏ మాత్రం తీసిపోదు. 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా మొదలు పెడితే, అది కాస్తా 350 కోట్లకు చేరింది. బడ్జెట్ గురించి నిర్మాత ఇంతవరకు చెప్పకపోయినా, విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు రివీల్ చేసేసాడు. ‘పెద్ది’ ఎన్ని సార్లు వాయిదా పడినా, ఈసారి మాత్రం ఐపీఎల్ భయం లేకుండా థియేటర్స్ లోకి వస్తుంది. స్టూడెంట్స్‌కు ఇంకో వారం రోజులు సెలవులు ఉండడం కూడా సినిమాకు కలిసి రానుంది. దీంతో ప్రీ బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగుంది. అంతా బానే ఉన్నా, ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 200 కోట్లు దాటింది. చిరంజీవితో నటించిన ‘ఆచార్య’, ఎన్టీఆర్‌తో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మినహాయిస్తే, సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా బిజినెస్ 200 కోట్లు దాటడం ఇది రెండోసారి. పాన్ ఇండియాగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ 221 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఈ మార్కును ‘పెద్ది’ దాటకపోయినా, 218 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలిసింది.

ఈ భారీ టార్గెట్‌ను టచ్ చేయాలంటే ‘పెద్ది’కి హిట్ టాక్ చాలా అవసరం. రామ్ చరణ్ సినిమా బిజినెస్ 90 కోట్ల నుంచి ఒకేసారి 221 కోట్లకు చేరింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన ‘ధ్రువ’ 57 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే, 58 కోట్ల వసూళ్లతో బయటపడింది. ‘రంగస్థలం’ను 80 కోట్లకు అమ్మితే, 127 కోట్లతో భారీ లాభాలు తీసుకొచ్చింది. ‘వినయ విధేయ రామ’ 90 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే, 63 కోట్లు మాత్రమే వచ్చింది. ‘గేమ్ చేంజర్’తో ఒకేసారి 221 కోట్లకు చేరాడు, అయితే ఇది 94 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలు మిగిల్చింది. ‘పెద్ది’కి ఉన్న హైప్ సినిమాకు హ్యూజ్ బిజినెస్ తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ 218 కోట్లకు బిజినెస్ జరుపుకుంది.

×
×
Ad

ఈ టార్గెట్ పెద్దదిగా కనిపిస్తున్నా, హిట్ టాక్ వస్తే 218 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాదు. ఈ మార్కు చేరాలంటే 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ‘పెద్ది’ గురించే మాట్లాడుకుంటుంది. సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా? లాభాలు వస్తాయా? అని చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘విశ్వంభర’ (మనశంకర్ వరప్రసాద్), ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమురారి’ తప్పితే గత నాలుగు నెలలుగా ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, ఐపీఎల్ ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ ను బూచిగా చూపించే ఛాన్స్ లేదు. అనుకూల వాతావరణంలో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’ ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో చూడాలి మరి.