Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ విషయంలో ‘పెద్ది’, ‘గేమ్ చేంజర్’కు ఏ మాత్రం తీసిపోదు. 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా మొదలు పెడితే, అది కాస్తా 350 కోట్లకు చేరింది. బడ్జెట్ గురించి నిర్మాత ఇంతవరకు చెప్పకపోయినా, విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు రివీల్ చేసేసాడు. ‘పెద్ది’ ఎన్ని సార్లు వాయిదా పడినా, ఈసారి మాత్రం ఐపీఎల్ భయం లేకుండా థియేటర్స్ లోకి వస్తుంది. స్టూడెంట్స్‌కు ఇంకో వారం రోజులు సెలవులు ఉండడం కూడా సినిమాకు కలిసి రానుంది. దీంతో ప్రీ బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగుంది. అంతా బానే ఉన్నా, ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 200 కోట్లు దాటింది. చిరంజీవితో నటించిన ‘ఆచార్య’, ఎన్టీఆర్‌తో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మినహాయిస్తే, సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా బిజినెస్ 200 కోట్లు దాటడం ఇది రెండోసారి. పాన్ ఇండియాగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ 221 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఈ మార్కును ‘పెద్ది’ దాటకపోయినా, 218 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలిసింది.
ఈ భారీ టార్గెట్‌ను టచ్ చేయాలంటే ‘పెద్ది’కి హిట్ టాక్ చాలా అవసరం. రామ్ చరణ్ సినిమా బిజినెస్ 90 కోట్ల నుంచి ఒకేసారి 221 కోట్లకు చేరింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన ‘ధ్రువ’ 57 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే, 58 కోట్ల వసూళ్లతో బయటపడింది. ‘రంగస్థలం’ను 80 కోట్లకు అమ్మితే, 127 కోట్లతో భారీ లాభాలు తీసుకొచ్చింది. ‘వినయ విధేయ రామ’ 90 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే, 63 కోట్లు మాత్రమే వచ్చింది. ‘గేమ్ చేంజర్’తో ఒకేసారి 221 కోట్లకు చేరాడు, అయితే ఇది 94 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలు మిగిల్చింది. ‘పెద్ది’కి ఉన్న హైప్ సినిమాకు హ్యూజ్ బిజినెస్ తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ 218 కోట్లకు బిజినెస్ జరుపుకుంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఈ టార్గెట్ పెద్దదిగా కనిపిస్తున్నా, హిట్ టాక్ వస్తే 218 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాదు. ఈ మార్కు చేరాలంటే 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ‘పెద్ది’ గురించే మాట్లాడుకుంటుంది. సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా? లాభాలు వస్తాయా? అని చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మనశంకర్ వరప్రసాద్, ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమురారి’ తప్పితే గత నాలుగు నెలలుగా ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, ఐపీఎల్ ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ ను బూచిగా చూపించే ఛాన్స్ లేదు. అనుకూల వాతావరణంలో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’ ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..