Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడుదలకు ముందే ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘పెద్ది’. కానీ, ఈ హైప్ మొత్తం నిజంగానే కథ, మేకింగ్ వల్ల వచ్చిందా? లేక రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పెరిగిందా? నిజమైన పెహల్వాన్లతో షూటింగ్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి? షూటింగ్ సమయంలో ఆర్టిస్టుల నుంచి నాచురల్ ఎమోషన్స్ రావడానికి దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి పద్ధతులు ఫాలో అయ్యాడో ఇప్పుడు చూద్దాం. ‘పెద్ది’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమాపై హైప్ కూడా భారీగానే పెరుగుతోంది. ప్రమోషన్స్ బాధ్యత చరణ్, బుచ్చిబాబు ఇద్దరే తీసుకున్నారా అనే టాక్ కూడా ఒకవైపు వినిపిస్తోంది. అందులో భాగంగానే ‘A Driving Through Peddi Memories’ వీడియో రిలీజ్ అయింది.
‘పెద్ది’ కథ మొదట వినగానే రామ్ చరణ్ ఆసక్తి చూపాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కారణం.. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాకుండా, గ్రామీణ బ్యాక్ డ్రాప్లో సాగే రా అండ్ ఎమోషనల్ కథ కావడమే! ఇంకా స్క్రిప్ట్ బాగా కుదిరిందని, ఆ స్క్రిప్ట్ కి పడిపోయాడట చరణ్. దేశీ పెహల్వాన్ పాత్ర కోసం చరణ్ దాదాపు ఏడాదికి పైగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. షూటింగ్ లో నిజమైన పెహల్వాన్లను ఉపయోగించడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. ఫైట్ సీన్స్ ఎక్కువగా నాచురల్ గా కనిపించేందుకు రియల్ రెజ్లర్లతోనే రిహర్సల్స్ చేశారట. అయితే, ఆ ఫైట్స్ లోనే చరణ్ చేతికి గాయమైంది. అయినా షూటింగ్ ఎక్కడా ఆగలేదు. ఇలాంటి రియలిస్టిక్ అప్రోచ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఆడియన్స్‌కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో రిలీజ్ తర్వాతే క్లారిటీ వస్తుంది.
Also Read
దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా ట్రీట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నటీనటుల నుంచి సహజమైన భావోద్వేగాలు రాబట్టేందుకు సెట్స్ పై ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేశాడట. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే దిల్లీ ఎపిసోడే ఈ సినిమా కథ అంటున్నాడు చరణ్. ఆ దిల్లీ ఎపిసోడ్ లో చరణ్ నటనను ప్రశంసిస్తున్నాడు బుచ్చిబాబు.’పెద్ది’ ఇప్పుడు టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య రానున్న ప్రాజెక్ట్; కానీ, ఈ సినిమాపై ప్రెజర్ కూడా అంతే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ నుంచి ప్రేక్షకులు ఇప్పుడు సాధారణ కమర్షియల్ సినిమా కంటే కొత్త అనుభవాన్ని ఆశిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న ఈ సమయంలో ‘పెద్ది’ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? లేక అంచనాల భారంతో తడబడుతుందా? అనేది జూన్ 4న తేలిపోతుంది.
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!