Hanuman Producer Chaitanya Reddy Clarity on Jai Hanuman Release Date: హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డార్లింగ్ అనే సినిమా తెరకెక్కింది. హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ డార్లింగ్ సినిమాని నిర్మించారు. ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్న సినిమా యూనిట్ అందులో భాగంగా ఈరోజు నిర్మాతతో మీడియా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె డార్లింగ్ సినిమా విశేషాలతో పాటు తమ ప్రొడక్షన్లో రాబోతున్న జై హనుమాన్ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ కూడా ఇచ్చారు.
Rajtarun-lavanya Love Fight: సినిమా రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య
నిజానికి హనుమాన్ సినిమా చివర్లో జై హనుమాన్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం చైతన్య రెడ్డి ఆ సినిమా మినిమం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉన్నట్లుగా కామెంట్ చేశారు. ఎందుకంటే జై హనుమాన్ సినిమాలో ఈ హనుమాన్ ఫ్రాంచైజ్ లో ఉన్న అందరు హీరోలను తీసుకురావాలని అనుకుంటున్నారని దానికి తగ్గట్టు స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేర్పులు చేశారని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని సంక్రాంతికి రావడం అయితే అసాధ్యమే అని ఆమె కామెంట్ చేశారు. కనీసం రెండేళ్లన్నా పడుతుందంటూ ఆమె అభిప్రాయపడ్డారు. హనుమాన్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము అనుకోలేదు, ఇప్పుడు ఆ సక్సెస్ ని గౌరవిస్తూ రెండో భాగాన్ని అంతకుమించి ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చేదిద్దుతున్నామని ఆమె అన్నారు.