NTV Telugu Site icon

Ram Charan Fans: మృత్యువాత పడ్డ అభిమానుల ఇంటికి చరణ్ ఫ్యాన్స్

Ram Charan Fans

Ram Charan Fans

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా మరణించిన ఇద్దరు రామ్ చరణ్ అభిమానుల కుటుంబాలను ఇతర అభిమానులు కలిసి వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులు – అరవపల్లి మణికంఠ (23), తోకాడ చరణ్ (22) – రాజమహేంద్రవరం లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కాకినాడ గైగోలుపాడు ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటనతో రామ్ చరణ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. చరణ్ ఈ ఘటన తనను ఎంతో బాధించిందని, బాధిత కుటుంబాలతో సమానమైన బాధను తాను అనుభవిస్తున్నానని తెలిపారు.

Pushpa 2: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్

ఈ ఘటనకు స్పందనగా, చరణ్ తక్షణమే ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు. వెంటనే ఆయన తన బృందాన్ని బాధిత కుటుంబాలను పరామర్శించడానికి పంపారు మంగళవారం అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్ తల్లిదండ్రులకు ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన అనంతరం, బుధవారం రామ్ చరణ్ అభిమానులు ఆ కుటుంబాలను కలుసుకున్నారు. వారు మణికంఠ తల్లి అరవపల్లి భవాని, చరణ్ తండ్రి తోకాడ అప్పారావును పరామర్శించారు. వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Show comments