Peddi Sensor talk : పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్.. ఈ కథను ఒప్పుకోవడం ఒక పెద్ద సాహసమే

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ సెన్సార్ టాక్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

దుబాయ్ సెన్సార్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ సీన్స్ నుంచి సినిమా వేరే లెవెల్‌కు చేరుకుంటుందని టాక్. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో రామ్ చరణ్, సీనియర్ నటుడు జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. వీరిద్దరి నటనను ప్రేక్షకులు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా బుచ్చిబాబు డిజైన్ చేశారని ఇన్సైడ్ టాక్.ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ‘పెద్ది’ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్ రైడ్‌కు గురి చేస్తుందని సమాచారం. రామ్ చరణ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టించబోతున్నారట. దర్శకుడు బుచ్చిబాబు సన టేకింగ్, కథను నడిపించిన తీరు థియేటర్లలో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇంతటి పవర్‌ఫుల్ ఎమోషనల్ క్లైమాక్స్ రాలేదనే రేంజ్‌లో దుబాయ్ టాక్ వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో అయి ఉండి రామ్ చరణ్ ఇంతటి ఇంటెన్స్ ఎమోషనల్ కథను ఒప్పుకోవడం నిజంగా ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. సినిమా మొత్తానికి సెకండాఫ్‌లోని చివరి 45 నిమిషాలు అతిపెద్ద ఆసెట్‌గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఈ సీన్స్ మరియు ఆ తర్వాత వచ్చే ఊహించని ట్విస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక సంచలనంగా మారుతుందని గట్టిగా వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, అదిరిపోయే సస్పెన్స్ ట్విస్ట్‌లతో కూడిన ఈ ‘పెద్ది’ పూర్తి రివ్యూ తెలియాలంటే మాత్రం జూన్ 4న థియేటర్లలో బొమ్మ పడేవరకు ఆగాల్సిందే.