లింగుస్వామి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా విశాల్ ‘పందెం కోడి’. ఈ సినిమాతో పాటు ‘రన్’, ‘ఆవారా’, ‘వైట్టై’ వంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలోనివే. అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇతగాడు ప్రస్తుతం పరాజయాలబాటలో ఉన్నాడు. కానీ తాజాగా హీరో రామ్ కి కథ చెప్పి ఒప్పించి షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. ఇటీవల రామ్ కూడా కథ నచ్చింది త్వరలో షూట్ అంటూ ట్వీట్ కూడా చేసేశాడు. కట్ చేస్తే ఫిలిమ్ ఛాంబర్ లో లింగుస్వామి మీద కంప్లైట్ రెడీ అయింది. దీనిని ఇచ్చింది ఎవరో కాదు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా.
Read Also : “రాధే శ్యామ్” షూటింగ్ రీస్టార్ట్
లింగుస్వామికి తనకు మధ్య పాత లెక్కలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని, అవి తేలాల్సి ఉందంటూ తకరారు పెట్టారు జ్ఞానవేల్ రాజా. లింగుస్వామి నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ తో కలసి తమిళంలో సినిమాలు తీశారు జ్ఞానవేల్ రాజా. ఇద్దరి మధ్య లెక్కల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయి. అందుకే జ్ఞానవేల్ రాజా ఇక్కడ సినిమా సంఘాలు అన్నింటిలో ఫిర్మాదు చేశారు. దీని వల్ల రామ్ తో సినిమాకు బ్రేక్ పడే అవకాశం లేకపోలేదు. అసలే హీరోలు దొరకక ఇబ్బందుల్లో ఉన్న లింగుస్వామికి చేతిలో ఉన్న రామ్ కూడా జారిపోతే కష్టంగా మారుతుంది. మరి ఈ సమస్యను లింగుస్వామి ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి.