Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!

Rakul Prithsing

Rakul Prithsing

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ని వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రకుల్.. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ‘రిలేషన్‌షిప్స్ & మోసం’ (Cheating) పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా ఓ యూట్యూబ్ టాక్ షోలో ఆయుష్మాన్ ఖొరానా, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంధాలు, మోసాల గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో ముందుగా రిలేషన్‌లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నిజాయితీగా క్షమాపణ చెబితే క్షమించేయాలని, మనమంతా మనుషులమే కాబట్టి పొరపాట్లు సహజమని ఆయుష్మాన్ పేర్కొన్నారు. అలాగే ఒక్కసారి పొరపాటున మోసం చేస్తే క్షమించవచ్చా? అని సారా అడగ్గా.. రకుల్ తొలుత ‘ఓకే’ అంది. కానీ, వెంటనే స్పందిస్తూ.. ‘ఒక్కసారి తప్పు చేస్తే క్షమించొచ్చు, కానీ దాన్నే అలవాటుగా (Habit) మార్చుకుని పదే పదే మోసం చేస్తూ ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, సహించను’ అని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పింది. తన వ్యాఖ్యలు పర్సనల్ లైఫ్‌కు ముడిపెట్టి వివాదంగా మారుతాయని గ్రహించిన రకుల్.. ఇంటర్వ్యూలోనే వెంటనే .. ‘నేను చెప్పిన అభిప్రాయం కేవలం సాధారణమైనది మాత్రమే. ఇది నాకు, నా భర్త జాకీ భగ్నానీకి అస్సలు వర్తించదు. దయచేసి దీనిపై ఎలాంటి తప్పుడు వార్తలు, గాసిప్స్ సృష్టించొద్దు’ అని క్లారిటీ ఇచ్చింది.