తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. .ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లారు.వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారని తెలుస్తోంది.
Also Read : Devara : ఏపీ – తెలంగాణ మొదటి వారం కలెక్షన్స్.. NTR ఊచకోత..!
ఇక రజినీకాంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు తేలిపాయి. ప్రస్తుతం రజనీ రెండు సినిమాలలో నటిస్తున్నారు. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ షూటింగ్ ముగిచుకుని మరో వారం రోజుల్లో రిలీజ్ కు రెడీ గా ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నారు. ‘కూలీ’ మొదటి షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయింది. అక్కినేని నాగార్జున, రజినీపై కొన్నికీలక సన్నివేశాలను తెరకెక్కించారు లోకేష్. రజనీ సీన్స్ కంప్లిట్ చేసుకుని చెన్నై వెళ్ళాక ఆత్వస్థతకు గురయ్యారు. మరో నాలుగు రోజుల్లో కూలీ వైజాగ్ షూట్ ముగియనుంది. అక్టోబరు 17నుండి సెకండ్ షెడ్యూల్ చెన్నై లో స్టార్ట్ కానుంది. ఆ షూట్ లో రజనీ పాల్గొంటారు. ఇక ఇప్పుడు రజినీకాంత్ ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.