సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఒక అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకు మరే హీరో ఆ రికార్డు బద్దలు కొట్టలేకపోయారంటే, ఆయన నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ రికార్డు ఏంటంటే, ఇప్పటివరకు ఏ ఒక్క కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్‌లోనూ నటించని ఏకైక స్టార్ హీరోగా రజనీకాంత్ ఘనత అందుకున్నారు. ఏ కంపెనీ వారైనా ఎన్ని కోట్లు ఇస్తామన్నా సరే, “నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు నన్ను ఫాలో అయ్యే వారు గుడ్డిగా. మాస్టారు, ఆ తర్వాత జరిగే లోటుపాట్లకు నేనే బాధ్యుడిని అవుతాను. కాబట్టి అలా వచ్చే సంపాదన నాకొద్దు,” అని అంటూ ఉంటారు రజనీకాంత్.
Also Read : Murali Nayak: వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్.. హీరో ఎవరంటే?
దీంతో ఆయా కంపెనీల వారు, “వీడియోలో నటించక్కర్లేదు, కనీసం ఈ ముఖాన్ని అయినా వాడుకోనివ్వండి, ఫోటోలతో పని కానిస్తాం,” అన్నా కూడా ఆయన ససేమిరా వద్దనే చెబుతారు. అయితే, ఆయన కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్‌లో నటించలేదు కానీ, తమిళనాడు ప్రభుత్వం 1980లో ప్రారంభించిన పల్స్ పోలియో వ్యాక్సిన్ అవగాహన కోసం మాత్రం పైసా తీసుకోకుండా యాడ్స్‌లో నటించాడు. రజనీ చేసిన ఆ యాడ్ కారణంగా తమిళనాడులోని మారుమూల పల్లెల్లోకి కూడా పల్స్ పోలియో అవగాహన వెళ్ళింది. అది ఎంతలా అంటే, జనం పల్స్ పోలియో అనకుండా రజనీ పోలియో చుక్కలు అనేవారట. ఆ తర్వాతి కాలంలో ఆయన నేత్రదానం చేయమని మరో ప్రకటనలో నటించారు. అది కూడా ఉచితంగానే, కానీ పైసా తీసుకోలేదు. అలా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్‌లో నటించని హీరోగా ఆయన రికార్డులకెక్కారు.
