తమిళ రాజకియాలు బాగా వేడెక్కుతున్నాయి. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు ప్రకటాయించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే పని పయిపోయిందని ఇక ఈ పార్టీ మూసేసుకోవాలని కొందరు వ్యాఖ్యానించారు. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డీఎంకే పార్టీ పై సంచలన కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
Also Read: Kerala: మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం.. అసలేం జరిగిదంటే..?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ శనివారం మంత్రి ఎ.వి.వేలు రచించిన ‘కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ ” డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా ఈ పార్టీ ఎదుర్కొంటుంది. డీఎంకే అనే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరు. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఇతరులను బాధించకూడదు. మాజీ ముఖ్యమంత్రి, కళాకారుడు కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కనుమరుగయ్యే వారు, కరుణానిధి పాలనలో సమాజం, ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట ఆయన ఒక్కడే మాట్లాడినట్టు కాదు పైనుంచి ఆర్డర్ వస్తేనే ఆయన అంతలా మాట్లాడి ఉంటారు. సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కానీ స్టాలిన్ సమర్థవంతంగా ఆ పని చేస్తూ ఉన్నారు.
వరుసగా పార్టీకి విజయాలను తీసుకుని వస్తున్నారు ఆయనకు నా అభినందనలు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా అన్నారు అని తమిళ తంబీలు చర్చించుకుంటున్నాయి.