Site icon NTV Telugu

Rajinikanth : ‘జైలర్ 2’ నుంచి సాలిడ్ అప్డేట్!

Jailar2

Jailar2

కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో రజిని కాంత్ స్థానం ముందు వరుసలో ఉంటుంది. అభిమానులు అనడం కంటే భక్తులు అన్నడం ఉత్తమం. ఎందుకంటే హీరోలే ఇంకో హీరోకు ఫ్యాన్స్ అవ్వడం అనేది రజినీ విషయంలోనే జరిగింది. ఆయన అభిమానులలో చాలా మంది హీరోలు కూడా ఉన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి కూడా అంతే జోష్ తో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు రజిని కాంత్ . కాగా రీసెంట్ గా ఆయన నటించిన ‘జైలర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీ కి సీక్వెల్ గా ‘‘జైలర్ 2’ కూడా వస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Dream : భయపెట్టే కలలు ఎందుకొస్తాయి తెలుసా..?

కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈరోజు నుండి రెండు వారాల షెడ్యూల్ రజిని పై మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వారాలు తర్వాత మరో షెడ్యూల్‌లో రజినీకాంత్ లేని సీన్స్‌ని ఇతర ఆర్టిస్ట్ లతో మేకర్స్ తెరకెక్కించనున్నారట. అంతేకాదు ఈ మూవీలో కూడా పార్ట్ 1 లానే చాలా మంది స్టార్స్ కనిపించనున్నారట. వీటన్నిటి పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version