Rajinikanth SKips to Responding on Tirumla Laddu Controversy: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు వివాదం మీద స్పందించేందుకు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నిరాకరించడం హార్ట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీ విషయంలో చాలా కల్తీ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు కొన్ని జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి లడ్డు తయారీకి వాడారని ఆయన ఆరోపించారు. అంతేకాదు కొన్ని ల్యాబ్ రిపోర్టులను సైతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇదే విషయం మీద స్పందించేందుకు హైదరాబాద్ ఒక సినిమా ఈవెంట్ కోసం వచ్చిన కార్తీ నిరాకరించారు.
Harsha Sai: డబ్బు కోసం ఏమైనా చేస్తా.. నిస్సిగ్గుగా హర్ష సాయి కామెంట్స్.. మరో ఆడియో లీక్
లడ్డు సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని అన్నారు. ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద కామెడీ చేయకూడదని అన్నారు. ఈ క్రమంలో కార్తీ సారీ కూడా చెప్పారు ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు తాజాగా రజనీకాంత్ ఈ విషయంలో స్పందించేందుకు నిరాకరించారు . మీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త, తిరుపతి లడ్డు పై మీ అభిప్రాయం ఏమిటి?” అనే ప్రశ్నకు నో కామెంట్ అంటూ మౌనంగా ఉండిపోయారు రజినీకాంత్. రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయన్ ది హంటర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు లైకా ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది.