Rajinikanth: రజినీ – కమల్ మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా? రెమ్యునరేషన్లకే సగం ఖర్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత అరుదైన, భారీ కలయికలో ఒకటిగా నిలవబోతున్న రజినీకాంత్ – కమల్ హాసన్ల మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం మేకర్స్ సుమారు రూ. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో సింహభాగం కేవలం ప్రధాన నటీనటులు, దర్శకుడి రెమ్యునరేషన్లకే ఖర్చవుతోందనే వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్యంగా రజినీకాంత్, కమల్ హాసన్, దర్శకుడు నెల్సన్‌లకు కలిపి భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు కలిసి నటిస్తుండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?