రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ అనే సినిమా రూపొందింది. నిజానికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), సత్య రాజ్ (Sathyaraj) వంటి వాళ్ళు నటించడంతో పాటు, కమల్ హాసన్ (Kamal Haasan) కుమార్తె శృతి హాసన్ (Shruti Haasan), రజినీకాంత్ కుమార్తె పాత్రలో నటిస్తుంది అనగానే అందరి దృష్టిలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. దీంతో భారీ ఓపెనింగ్స్ అందుకున్నా, రివ్యూస్ అలాగే మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా నెమ్మదిగా యావరేజ్గా మిగిలిపోయింది.
Also Read :SIDPA: K Ramp నిర్మాత అసభ్యకర వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. క్రిమినల్ అఫెన్స్!
నిజానికి లోకేష్ కెరీర్లోనే ఇంత వీక్ సినిమా చేస్తాడని ఊహించలేదని కూడా ఆయన అభిమానులే స్వయంగా చెప్పుకున్నారు. దీంతో లోకేష్ ఇప్పుడు ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అదేమంటే, ఈ సినిమా రజినీకాంత్ తో చేసి తాను వీక్ వర్క్ అనిపించుకున్నాను కాబట్టి, ఆయనతోనే మరో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి దాన్ని చెరిపేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి లోకేష్ డేట్స్ అడిగితే ఇప్పుడు కార్తీ (‘ఖైదీ 2’), కమల్ హాసన్ (‘విక్రమ్ 2’) సినిమాలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడరు. కానీ, లోకేష్ మాత్రం ఆ రెండు సినిమాలను పక్కనపెట్టి, ఎలా అయినా రజినీకాంత్ డేట్స్ పట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
