Site icon NTV Telugu

Kamal – Rajni వారసున్ని ప్రకటించిన వెంటనే రజనీ- కమల్ సినిమా?

Inbanidhi

Inbanidhi

రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో లోకేష్ కనకరాజు ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కూలీ మిశ్రమ స్పందన అందుకున్న నేపథ్యంలో ఆ సినిమా ఉండకపోవచ్చు అని అందరూ భావించారు. అయితే, వాస్తవానికి కూలి రిలీజ్ కంటే ముందే లోకేష్, కమల్ హాసన్‌తో పాటు రజనీకాంత్ ఇద్దరికీ కథ చెప్పి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ మీద కమల్ హాసన్ స్వయంగా నిర్మించబోతున్నారు. అయితే, రెడ్ జెయింట్ సంస్థ సమర్పించబోతోంది. అలాగే, ఫండింగ్ అంతా కూడా అదే సంస్థ చూసుకోబోతోంది.

Also Read:NTR Fans : మా హీరో ఏం చేశారు?.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు!

అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ సంస్థకి త్వరలో సీఈవోగా చార్జ్ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న ఆయన తన చదువు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఆయన సీఈవోగా చార్జ్ తీసుకున్న అనంతరం రజనీ-కమల్ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కోసం రజనీకాంత్ జైలర్ 2 సినిమాని కూడా పక్కన పెట్టే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయితే, పక్కన పెట్టడం కాకుండా ఈ సినిమాతో పాటు ఆ సినిమా షూటింగ్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పారలల్‌గా రెండు సినిమాల షూటింగ్ జరిగే అవకాశం ఉంది. మరోపక్క, ఖైదీ 2 ఆలోచనని కూడా లోకేష్ పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నారు.

Exit mobile version