KH x RK Reunion: ఇంతకీ ఎవరు హీరో?.. రజనీ-కమల్ స్పెషల్ వీడియో అదిరిందిగా!
- అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది
- ఒకే సినిమాలో తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు
- రజనీ-కమల్ స్పెషల్ వీడియో అదిరిందిగా
Rajinikanth and Kamal Haasan Reunion Movie: యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు ‘సూపర్ స్టార్’ రజనీకాంత్, ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 1979లో విడుదలైన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో పాన్ ఇండియా లెవల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేస్తు.. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘జైలర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ నెల్సన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. ఇక ఈ వీడియో మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. వింటేజ్ టచ్ ఇస్తు.. రజనీకాంత్, కమల్ హాసన్‌లు పోటాపోటీగా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘ఇందులో ఎవరు హీరో?’ అని వీరిద్దరూ అడగడం చాలా ఫన్నీగా అనిపిస్తోంది.
Also Read
- Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!
- Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
- Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
- Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలవబోతోంది. స్పెషల్ వీడియోకి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత బ్యానర్ అయిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అండ్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?