NTV Telugu Site icon

Rajendra Prasad : హే ‘రాజేంద్ర ప్రసాద్’.. ఏ క్యా హువా

Rajendra

Rajendra

రాజేంద్రప్రసాద్‌ మరో పృథ్వీగా కనిపిస్తున్నాడు. లైలా ఈవెంట్‌లో పొలిటికల్‌గా మాట్లాడి కాంట్రవర్సీ కొనితెచ్చుకున్న పృథ్వీ చివరికి సారీ చెప్పాడు. పృథ్వీ కంటే ముందే రాజేంద్రుడు కాంట్రవర్సీస్‌తో వార్తల్లో నిలిచాడు. రాబిన్‌హుడ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఒరేయ్‌ వార్నర్‌ ఇదే వార్నింగ్‌ అంటూ నటకిరీటి మాట్లాడిన తీరు ఈ క్రికెటర్‌ అభిమానులకు కోపం తెప్పించింది. రాజేంద్రప్రసాద్‌ ఏమాట్లాడాడో వార్నర్‌కు అర్థం కాక నవ్వాడు. అర్థమైన ఫ్యాన్స్‌ మాత్రం నట కిరీటిని ట్రోల్‌ చేయడం స్టార్ట్‌ చేశారు.

Also Read : Robin Hood : డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ కు ప్లస్సా.. మైనస్సా..?

దీంతో క్షమాపణ కోరుతూ వీడియో రిలీజ్‌ చేశాడు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముందు వార్నర్‌తో సరదాగా గడిపిన విశేషాలు పంచుకుంటూ తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. వెబ్‌ సిరీస్‌ హరికథ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటకిరీటి మాటలు ఏకంగా అల్లు అర్జున్‌ను వుద్దేశించి అన్నవే అంటూ జనాల్లోకి వెళ్లిపోయాయి. ‘ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు. హీరో పదానికే అర్థాలు మారిపోయాయన్నాడు. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్‌గా పుష్పకే తగలడంతో బన్నీ ఫ్యాన్స్‌ రాజేంద్రుడిపై మండిపడ్డారు. టంగ్‌ స్లిప్‌ కావడం సారీ చెప్పడం ఈ సీనియర్‌ యాక్టర్‌కు అలవాటైపోయింది. ఎర్ర చందనం దొంగ అంటూ పుష్ప గురించి చేసిన వ్యాఖ్యలు ఏ అర్థంలో అన్నదో షష్టిపూర్తి సినిమా ఈవెంట్‌లో వివరణ ఇచ్చాడు రాజేంద్రప్రసాద్‌. ఇదే టాపిక్‌ బన్నీ దగ్గర వస్తే ఇద్దరం సరదాగా నవ్వుకున్నామన్నాడు. లేడీ టైలర్‌, అప్పుల అప్పారావు, పేకాట పాపారావులో చేసిన పాత్రలు మన చుట్టూ వున్న వ్యక్తులను ప్రతిబింస్తాయని అదే వుద్దేశంతో ఎర్రచందనం దొంగ గురించి మాట్లాడానంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.