ఇటీవల రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాదు, ఒక పెద్ద ఈవెంట్ చేసి టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వారణాసి పేరుతో రూపొందించబోతున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. అయితే, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం చేసిన ఈ ఈవెంట్ రాజమౌళి ప్లాన్ చేసినట్లు దొరక్కపోవడంతో, “ఆంజనేయస్వామి ఉంటే ఇదేనా బాగా చూసుకునేది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read:iBomma: ఐ బొమ్మలో సినిమాలు చూశారా? తస్మాత్ జాగ్రత్త
ఈ విషయంలో రాజమౌళి మీద చాలామంది విరుచుకుపడుతున్నారు. రాజమౌళి లాంటి స్థాయి దర్శకుడు ఇలా మాట్లాడటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకచోట రాజమౌళి మీద పోలీస్ కేసు కూడా నమోదు చేయమని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్ కోసం రాజమౌళి టీమ్ దాదాపు ₹30 కోట్లు ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా, ఇది నిజమే అని తెలుస్తోంది. కేవలం ఎల్ఈడీ స్క్రీన్ కోసమే దాదాపుగా ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఖర్చుపెట్టినట్లుగా సమాచారం.
Also Read:TTD Parakamani Case: పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అలాగే, సీటింగ్ సహా ఇతర అరేంజ్‌మెంట్స్‌తో పాటు మరిన్ని విషయాలకు గట్టిగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. చాలామంది ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులను హైదరాబాద్ పిలిపించి వారిచేత ఇంటర్వ్యూలు కూడా చేయించారు. ఈ నేపథ్యంలో వారికి ప్రయాణ ఖర్చులు, అకామొడేషన్ మొత్తం కలిపి ఈవెంట్ కోసం ఏకంగా ₹30 కోట్లు ఖర్చుపెట్టినట్లు అయింది. ఇంత ఖర్చు పెట్టి కష్టపడి చేస్తే, అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు అనే ఆవేదనతో రాజమౌళి అలా మాట్లాడేశారు. ఇప్పుడు కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
