SSMB29: దర్శకధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతుంది. అయితే, ఇప్పటి వరకు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వారితోనే రాజమౌళి పని చేశారు. కానీ, ఇప్పుడు ‘SSMB29’ పై మొదటి నుంచి భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అలాగే, మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ విధంగా చూసిన కూడా ఈ ప్రాజెక్టు చాలా స్పెషల్ గా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ స్పెషల్ మూవీకి టైటిల్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. మహేష్ బాబు ఇమేజ్ కి సరిపడేలా పవర్ఫుల్ గా, క్యాచీగా ఉండేలా రాజమౌళి చూసుకుంటారని టాక్. ఇక, ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
Read Also: Karan Johar : బాలీవుడ్‌లో స్నేహాలు పార్టీల వరకే.. ఆపదొస్తే ఎవ్వరు రారు
కాగా, రాజమౌళి- మహేష్ బాబు సినిమా అంటే టైటిల్.. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. కాగా, ఈ సస్పెన్స్ కి తెర పడాలంటే మనం నవంబర్ 16 వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ సమయానికే రానున్నాయి. ఇక, ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో.. వారణాసి వాతావరణాన్ని తలపించేలా ఓ భారీ సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు టాక్. ఇప్పటికే, మహేష్, ప్రియాంక షూట్ పూర్తయింది.. వీఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.
