Rajamouli : ఎన్టీఆర్ నా స్నేహితుడు కాదు.. నా మిత్రులు వారే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్,రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .దర్శకుడిగా రాజమౌళి మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ సూపర్ హిట్ అయింది.ఆ సినిమాతో రాజమౌళి ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో యమదొంగ మరియు రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అయితే రాజమౌళి ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ లో తనకు ఎంతో ఇష్టమైన హీరో తారక్ అని చెప్పేవారు.
నేను ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ,నిర్మాతకు మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటాను. కానీ తారక్ తో సినిమా చేసేటప్పుడు ఆ సినిమా తారక్ కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తుంటాను అని రాజమౌళి గతంలో తెలిపారు .దీనితో వీరి బాండింగ్ చూసి ఎన్టీఆర్ ,రాజమౌళి మంచి స్నేహితులు అని అంతా భావించారు.అయితే తాజాగా ఎన్టీఆర్ నా మిత్రుడు కాదని రాజమౌళి చెప్పడం చర్చకు దారి తీసింది. రీసెంట్ గా కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళిని ఇండస్ట్రీలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని అడగగా అక్కడ వున్న ప్రేక్షకులు అంతా ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దానికి రాజమౌళి స్పందిస్తూ ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదు నా తమ్ముడు లాంటి వాడు అని తెలిపాడు .నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బాహుబలి నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి అని ఆయన తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!