Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Directors: టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. కథ, హీరోల విషయంలోనే కాకుండా హీరోయిన్ ఎంపికలోనూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ను ఆకర్షించేందుకు బాలీవుడ్ భామలను టాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కు దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు ఒకరకంగా బాటలు వేశాయని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో అలియా భట్‌తో మొదలైన ఈ ట్రెండ్, తర్వాత ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొణె, ‘దేవర’లో జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాన్ ఇండియా సినిమాల్లో నార్త్ హీరోయిన్లకు డిమాండ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను పలువురు స్టార్ డైరెక్టర్లు ఫాలో అవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’లో దీపికా పదుకొణె ఇప్పటికే భాగమయ్యారు. ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘AA23’ విషయంలోనూ బాలీవుడ్ హీరోయిన్ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో తృప్తి డిమ్రి ఎంపికైన విషయం తెలిసిందే. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘కల్కి 2’లోనూ బాలీవుడ్ భామను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాన్ ఇండియా సినిమాల్లో నార్త్ హీరోయిన్లకు డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమవుతోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతారా? అనే చర్చ మొదలైంది. రామ్ చరణ్‌తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘RC17’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో శ్రద్ధా కపూర్ పేరు కూడా వినిపించింది. అయితే గతంలో ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్‌ను సంప్రదించగా.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఆ ప్రయత్నం ముందుకు సాగలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తంగా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోయిన్ల వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో నార్త్ బ్యూటీనే హీరోయిన్గా ఎంపిక చేస్తారా? లేక సౌత్ హీరోయిన్‌తో సరిపెడతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..