Site icon NTV Telugu

‘Baahubali: The Epic’ : అనుష్కను ఒప్పించే పనిలో పడిన రాజమౌళి..!

Bhahubali Thi Epik

Bhahubali Thi Epik

‘బాహుబలి: ది ఎపిక్’ మెగా రీ–రిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్‌, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహా చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం చుట్టూ మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే ప్రభాస్‌ ఒక వీడియో బైట్‌ రిలీజ్‌ చేస్తూ “ఈ ఇతిహాసాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడండి” అంటూ అభిమానులను థియేటర్లకు ఆహ్వానించాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి అనుష్క వైపే. ఎందుకంటే, ఆమె ఈ ప్రమోషన్లలో పాల్గొనబోతుందా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read :Sonal Chauhan : ‘మీర్జాపూర్‌: ది ఫిల్మ్‌’లో సోనాల్‌ ఎంట్రీ..!

తాజాగా విడుదలైన ఆమె సినిమా ‘ఘాటి’ ప్రమోషన్లకు అనుష్క హాజరుకాలేదు. కేవలం ఆడియో ఇంటర్వ్యూల ద్వారానే ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడిం‌ది. తన ఫిగర్ పై దృష్టి పడకూడదనే ఉద్దేశంతో ఆమె కెమెరా ముందు రావడాన్ని మానేసిందని టాక్‌. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. బాహుబలి ఫ్రాంచైజీ అనేది భారత సినిమా చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన ప్రాజెక్ట్‌. అలాంటి చిత్ర రీ–రిలీజ్‌కి అనుష్క హాజరవ్వక తప్పదు అని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఆమె ఒప్పుకోవాలంటే రాజమౌళి తన మాజిక్‌ వర్క్‌ చేయాల్సిందే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటి వరకైతే ఎవరినైనా సులభంగా ఒప్పించగల వ్యక్తి అంటే రాజమౌళి, ఇక అనుష్కను కూడా ప్రమోషన్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. మరి ‘బాహుబలి: ది ఎపిక్’ ద్వారా అనుష్క మళ్లీ అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని పునరుద్ధరించుకోగలదా? అనేది చూడాలి. ఏదేమైనా, రాజమౌళి – అనుష్క జోడీ మళ్లీ ఒకే వేదికపై కనిపిస్తే, బాహుబలి రీ-రిలీజ్ ప్రమోషన్లకు అదో బ్లాక్‌బస్టర్‌ బూస్ట్‌ అవుతుందని చెప్పొచ్చు.

Exit mobile version