రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు టాలీవుడ్ లో మారె ఇతర స్టార్ హీరో చేయడం లేదు. గతేడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ అనుదుకున్న డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’లో శివుడిగా నటించేందుకు నో చెప్పిన స్టార్ హీరో ఇతడే.!
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయినా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన గ్లింప్స్ చూసి ప్రభాస్ ను మళ్లీ వింటేజ్ లో చూసినట్టు ఉందని.. మిర్చి తరువాత మళ్లీ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు ఫైటింగ్ సీన్లు కొన్ని తెరకెక్కించనున్నాడు మారుతీ. అయితే ఈ షెడ్యూలులో ప్రభాస్ ఉండరని ఆయన లేని సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట. ఫిబ్రవరి లో షూట్ చేసే10 రోజుల షెడ్యూల్ లో డార్లింగ్ వచ్చి చేరతాడు. ఆ షెడ్యూల్ లో పాటలు మినహా మిగిలిన వర్క్ అంతా పూర్తవుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. కానీ ఈ సినిమాలో విఎఫెక్స్ పోర్షన్ ఎక్కువ ఉంటుందని ఏప్రిల్ 10 నాటికి ఆ వర్క్ ఫినిష్ అవుతుందా లేదా అనే డౌట్ యూనిట్ లో ఉందట. వర్క్ ఫినిష్ కాకుంటే రిలీజ్ వాయిదా వేయక తప్పదు.