NTV Telugu Site icon

Raj Tarun : ఓ వైపు కేసులు.. మరోవైపు రిలీజ్ లు.. హిట్టు దక్కేనా..?

Untitled Design (4)

Untitled Design (4)

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాజ్ తరుణ్ సినీ కెరీర్ అలా అలా సాగుతుంది. ఇటీవల రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అతనిపై ఛీటింగ్ కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మరు మోగింది. సినిమాలలో చేసినప్పుడు రాని క్రేజ్ ఒకే ఒక్క కేసు వ్యవహారంతో పబ్లిసిటీ అమాంతం ఆలా పెరిగిపోయింది. మీడియాలో ఎక్కడ చుసినా రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు వ్యవహారమే. ఈ కేసు ఇదంతా పక్కన పెడితే ఈ యంగ్ హీరో నటించిన అనేక సినిమాలు సందట్లో సడేమియా అన్నట్టు బాక్సాఫీస్ పై దండయాత్ర చేసాయి.

Also Read : HEMA : నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ : హేమా

కేసుల వ్యవహారంలో రాజ్ తరుణ్ కు వచ్చిన పబ్లిసిటీని వాడుకుందామని ప్రయత్నించి తిరగబడరా సామి, పురుషోత్తముడు వంటి సినిమాలను వరుస బెట్టి సినిమాలు రిలీజ్ చేసారు సదురు నిర్మాతలు. రెండు వేటికవే సూపర్ డూపర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఒకవైపు లావణ్య కేసు విచారణ సాగుతుండగా, మరోవైపు సినిమాలు చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ కుర్రహీరో నటించిన లేటెస్ట్ సినిమా భలే ఉన్నాడే. ఈ నెల 13న రిలీజ్ కు రెడీ గా ఉంది ఈ సినిమా. మారుతీప్ పర్యవేక్షణలో తయారయిన ఈ సినిమాపై రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ దఫా కచ్చితంగా హిట్టు కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రాజ్ తరుణ్. కేసులతో సతమత మవుతున్న రాజ్ తరుణ్ కు భలే ఉన్నాడే తో బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి

 

Show comments