Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

హారర్ కామెడీ సినిమాలకు సౌత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చిన హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్నారు. ముఖ్యంగా హారర్‌తో పాటు కామెడీని కలిపి ఆయన చూపించిన స్టైల్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రతి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ‘కాంచన’ ఫ్రాంచైజీకి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు ముగింపు దగ్గరపడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కాంచన 4’ ఈ ఫ్రాంచైజీలో చివరి సినిమా కావచ్చని సమాచారం. ‘ముని’తో మొదలైన ఈ ప్రయాణాన్ని గ్రాండ్‌గా ముగించాలని లారెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త అభిమానులకు కాస్త నిరాశ కలిగించినా, లారెన్స్ మాత్రం ఇకపై కొత్త జానర్లలో సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా, కొత్త ఫ్రాంచైజీలు మరియు ప్రయోగాత్మక కథలపై దృష్టి పెట్టనున్నారట. ప్రస్తుతం ‘కాంచన 4’ షూటింగ్‌లో బిజీగా ఉన్న లారెన్స్, ఈ సినిమాలో పూజా హెగ్డే ,నోరా ఫతేహివంటి స్టార్లను తీసుకుని పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లారెన్స్ తన ఫోకస్‌ను ‘బెంజ్’ (Benz) లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టుల వైపు మళ్ళించబోతున్నారని సమాచారం.