Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ వేడుకలో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొని జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ అధికారిక తెలుగు రీమేక్ ‘సివరాపల్లి’ లో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రకు గానూ ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు దేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో, ఓటీటీ విభాగంలో దేశవ్యాప్తంగా పోటీని తట్టుకుని రాగ్ మయూర్ ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం విశేషం.
2021లో వచ్చిన ‘సినిమా బండి’ చిత్రంతో నటుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన రాగ్ మయూర్, తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా హీరోగా, కామెడీ పాత్రల్లో, విలన్‌గా విభిన్న కోణాలను ఆవిష్కరించారు. నటనకు స్కోప్ ఉన్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న రాగ్ మయూర్, త్వరలోనే హీరోగా ‘అనుమాన పక్షి’ అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ తరుణంలో ఆయనకు జాతీయ స్థాయి అవార్డు దక్కడం పట్ల టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
- Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో 'లెనిన్' కలెక్షన్స్ ఎంతో తెలుసా?
- Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
- Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
తాజావార్తలు
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!