Site icon NTV Telugu

Raashi Khanna : షూటింగ్‌‌లో గాయపడ్డ హీరోయిన్..

Rashi Kanna

Rashi Kanna

షూటింగ్‌లో హీరోహీరోయిన్ లకు చిన్న చిన్న గాయలు సహజం. కానీ ఒక్కోసారి తీవ్రంగా కూడా తగులుతాయి. అలా ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో భాగంగా తాజాగా నటి రాశి ఖన్నా ఒక సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. షూటింగ్ జరుగుతుండగా జరిగిన ఈ ఘటనలో ఆమె ముఖానికి, అలాగే చేతులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక గాయ‌ల‌కు సంబంధించి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోల‌లో రాశీ ముఖం చేతులపై గాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. అలాగే

Also Read : Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ షూటింగ్ అప్డేట్..

ఈ ఫోటోలు పంచుకున్న రాశి ఖన్నా.. ‘ మనం ఎన్నో పాత్రలు పోషిస్తాము కానీ కొన్ని పాత్రలు పోషించాలి అంటే. నీ శరీరం, నీ శ్వాస, నీకు తగిలే గాయాలు అన్నీ ఇవ్వాలి. నువ్వు ఒకసారి తుఫానులా తయారయ్యాక, ఉరుము వచ్చిన‌ భయపడవు. త్వరలో రాబోతుంది’ అంటూ రాశీ పోస్ట్ చేసింది. కానీ ఇంతకి రాశీ ఏ సినిమాలో న‌టిస్తుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాశి ఖన్నా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.

 

Exit mobile version