హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నా అదృష్టం ఒక్కటి కొరవడుతుంటుంది, కొందరు హాట్ బ్యూటీస్ కి! ఆ కోవలోకే వస్తుంది రాయ్ లక్ష్మీ. కెరీర్ మొదట్లో లక్ష్మీ రాయ్ గా కొనసాగిన ఈ సెక్సీ బేబీ పేరు మార్చినా ఫేటు మారలేదు. లక్ష్మీ రాయ్ ఇప్పుడు రాయ్ లక్ష్మీగా చిన్నా, చితకా సినిమాలు చేస్తోంది. ఐటెం సాంగ్స్ తో నెట్టుకొస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా తగ్గాయి. అయితే, ఏది ఎలా ఉన్నా విపరీతమైన ఫిట్ ఫ్రీక్ అయిన రాయ్ లక్ష్మీ ఎప్పుడూ సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో జనాన్ని తెగ ఊరిస్తుంటుంది. లెటెస్ట్ గా హబీబీ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది, మన ‘రత్తాలు’…
రాయ్ లక్ష్మీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. నాజుకు నడుముని నాట్యమాడిస్తూ కుర్రాళ్ల నరాలు జివ్వుమనేలా బెల్లీ డ్యాన్స్ చేసేసింది. ‘హబీబీ హబీబీ’ అనే సాంగ్ కి బెంగుళూరు బేబీ స్టెప్పులేసింది. అఫ్ కోర్స్, చూసిన ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ సహజంగానే ‘ఆహా, ఓహో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు!
A post shared by Raai Laxmi (@iamraailaxmi)