NTV Telugu Site icon

Pushpa2 TheRule : పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ వేదిక మారే అవకాశం..?

Pushpa2 (5)

Pushpa2 (5)

పుష్ప 2 రిలీజ్ కు మరో ఐదు రోజుల మాత్రమే మిగిలిఉంది. ఒకవైపు పాన్ ఇండియా ప్రమోషన్స్ లో దూకుడుగా ఉన్న పుష్ప మేకర్స్ తెలుగు ప్రమోషన్స్ లో కాస్తవెనుకబడింది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కాలేజీకి చెందిన ఓపెన్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున చేయబోతున్నరు అని  అన్నారు.  కానీ అక్కడ చేసేందుకు పర్మిషన్స్ రాలేదని  పలు సాంకేతిక కారణాల వలన కాలేజీ గ్రౌండ్స్ లో ఈవెంట్ రద్దయినట్టు సమాచారం.

Also Read : Amaran : అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.!

నిర్మాతలు ఈ ఈవెంట్ ను మొదట LB స్టేడియంలో చేయాలని భావించారు. కానీ ఆ స్టేడియంలో శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ ఉండటంతో కుదరలేదు. ఈ నేపథ్యంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ చేయాలనే దానిపై మల్లగుల్లాలు నడుస్తున్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు యూసఫ్ గూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి పనులు కూడా మొదలైనట్లు సమాచారం ఈరోజు పొద్దు పోయాక పర్మిషన్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పుషప్ ప్రీమియర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీస్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసమై టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోసం చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో బుకింగ్స్ ఓపెన్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

Show comments