Site icon NTV Telugu

Pushpa2 : రికార్డుల రూలింగ్ మొదలెట్టిన పుష్పరాజ్

Pushpa2therule

Pushpa2therule

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ లో మైత్రీ మూవీ మేకర్స్‌పై  నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప కు పోటీగా మరే ఇతర సినిమాలు పోటీగా వచ్చేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది పుష్ప ది రూల్.

Also Read : Galla Ashok : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న దేవకి నందన వాసుదేవ

ఇదిలా ఉండగా విడుదలకు ఇంకా 18 రోజులు ఉండగానే ఓవర్సీస్ లో పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా $872,653 అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఓవర్సీస్ లోని తెలుగు సినిమాలలో ఒక రికార్డు. ఇక టికెట్స్ పరంగాను 30.7K టికెట్స్ బుక్ అయి రికార్డు క్రియేట్ చేసింది పుష్ప. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే అత్యంత వేగంగా, హయ్యెస్ట్ టికెట్స్ బుక్ అయిన సినిమాగా పుష్ప – 2 తోలి రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ లో డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది. కాగా నేడు సాయంత్రం పట్నాలోని గాంధీ మైదాన్ లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ వేడుకలో దర్శకుడు సుకుమార్ మినహాయించి మిగతా టీమ్ హాజరుకానుంది.

Exit mobile version