ఇండియన్ సినిమా దగ్గర అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’ మాత్రమే కాదు.. దాని పాటలు, సంగీతం కూడా అంతర్జాతీయంగా ఎంతగా ఆకట్టుకుంటున్నాయో మరోసారి తేలిపోయింది. తాజాగా అమెరికాలో ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో ‘అమెరికా గాట్ టాలెంట్’ (America’s Got Talent) స్టేజ్‌ను ఒక భారతీయ డ్యాన్స్ బృందం బీ యూనిక్ క్రూ (B-Unique Crew) ఊపేసింది.
Also Read : Ajith : 33 ఏళ్ల తన సినీ ప్రయాణంపై.. అజిత్ ఎమోషనల్ పోస్ట్
ఈ బృందం ‘పుష్ప’ మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు స్పెషల్ గౌరవంగా భావించదగ్గ ఈ ప్రదర్శనలో వాళ్లు చేసిన ఏకైకమైన మూమెంట్స్ – జడ్జిలకే కాదు.. అక్కడున్న ప్రేక్షకుల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను కూడా మెస్మరైజ్ చేశాయి.ఈ డ్యాన్స్ వీడియోను స్వయంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, ఈ టాలెంటెడ్ టీమ్‌ను అభినందించారు. ‘పుష్ప’ టీమ్ కూడా దీన్ని అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిపోయింది. భారతీయ ప్రతిభకు ప్రపంచ వేదికపై దక్కిన గుర్తింపు ఇది. పుష్ప మ్యూజిక్‌కి దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్థాయిని మరోసారి ప్రూవ్ చేసింది ఈ పర్ఫామెన్స్.
Icon Star @alluarjun's #Pushpa is a global phenomena 💥💥
The 'B Unique Crew' performed for the #Pushpa song on @AGT Season 20 stage and the response was sensational 🤩
The judges hailed it as 'THE BEST PERFORMANCE OF THE SEASON' 🌟🇮🇳❤️🔥pic.twitter.com/Nx1Zcfpyfw
— Pushpa (@PushpaMovie) August 4, 2025